మీ జాతకంలో శనిగ్రహ దోషం వుంటే నల్లరాయిపై చెక్కిన గణపతిని నిత్యం తప్పకుండా పూజించాలి. బెల్లం లేదా బెల్లతో చేసిన కుడుములు నైవేద్యందా సమర్పించాలి. ఈ గణపతిని ఆరాదించే సమయంలో ఎలాంటి చెడు పనులు చేయరాదు. ముసలివారికి, అంగవైకల్యం వున్నవారికి సహాయం చేయాలి తద్వారా మీకు బాధలు తొలగి శనైశ్చరుడు ప్రసన్నుడవుతాడు. ఇక ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధకము, అతినిద్ర , దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట,ఎముకలకు సంబంధించిన అనారోగ్యం, తల్లిదండ్రులతో విరోధముల, ఇతరుల ఆధీనములో పని చేయుట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌరవం లేకపోవుట, పాడుపడిన గృహాల్లో నివశించటం, ఇతరుల ఇంట్లో జీవనము సాగించటం, భార్య పిల్లలు అవమానించుట, కుటుంబమును విడిచి అజ్ఞాతంలో జీవించుట, సరైన భోజనం కూడా లేకపోవుట మొదలగు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు ప్రతి నిత్యం తప్పక శివునికి అభిషేకము చేయుట.విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట. శనివారము నియమముగా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట, హనుమాన్ చాలీసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు
పూజ చేపిస్తే మంచిది. స్వామి అయ్యప్ప మాల ధారణ చేయుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, పేదలకు, యాచకులకు దుప్పటి, చెప్పులు నల్ల వస్తువులు దానం చేయాలి. నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.
Read Also..
Read Also..