పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు. అందరు బంధువులే కావలసిన వారే వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసు అంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని వేడు కొన్నాడు. బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్ర కృష్ణ భగవాన్. వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు. పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు. మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు. ”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు. దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ. కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు. అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం ”రచించాడు .అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది. అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట. ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు. ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ సమేతం గా లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు.
Read Also..
Read Also..