శృంగేరి – భక్తులకు ఒక పవిత్ర పట్టణం
హిందూమత జగద్గురువు ఆది శంకరాచార్య తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణం శృంగేరి లో మొదటి మఠాన్ని స్ధాపించారు. అప్పటినుండి శృంగేరి ఒక యాత్రా స్ధలంగా వేలాది భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే ఉన్నారు. శృంగేరి పట్టణ ఇతిహాస, పురాణ పూర్వాపరాలు – శృంగేరి పట్టణం ఒక వనరుల సమృధ్ధికల, పచ్చటి ప్రదేశం. ఇది కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యులు శృంగేరి పట్టణానికి వచ్చినపుడు ఆ పట్టణంలో ఎంతో విశేషత ఆయనకు గోచరించటంతో తన మొదటి మఠాన్ని అక్కడ నిర్మించారు. తుంగ నది ఒడ్డున పర్యటించే సమయంలో ఆయన ఒక నాగుపాము తన పడగను విప్పి మండుటెండనుండి ఒక కప్పను కాపాడటం ఆయన దర్శించారు. తన శత్రువైన కప్పకు ఆ నాగుపాము చేసిన దయనీయ చర్య శంకరాచార్యులను ఆశ్చర్య పరచింది. ఆ ప్రదేశం ఎంతో విశిష్టతగల ప్రదేశంగా ఆయన గుర్తించారు. నేడు శృంగేరి పట్టణం ఆయన స్ధాపించిన శారదా పీఠం కలిగి ప్రతిరోజూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది. శృంగేరి లో ఇంకా చూడదగిన ప్రదేశాలు అంటే విద్యాశంకర్ మరియు శారదాంబ దేవాలయాలు.
విద్యా శంకర దేవాలయం
శ్రింగేరి పర్యాటకులు విద్యా శంకరులు కల దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ యాత్రా స్ధలం విద్యారణ్య స్వామి అనే రుషి చే విజయనగర రాజుల కాలంలో 1338లో నిర్మించబడింది. దేవాలయం ద్రవిడ, చాళుక్య, దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది. దీనిపై అనేక శిలా శాసనాలు విజయనగర రాజ్యానికి సంబంధించి చూడవచ్చు. నలుచదరం కల ఈ దేవాలయానకి 12 స్తంభాలు కలవు. ఇవి 12 రాసులను తెలుపుతాయి. లోపలి భాగంలో దుర్గామాత, విద్యా గణేశ విగ్రహాలుంటాయి. విగ్రహాలే కాకబ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర దేవతలు కూడా అందమైన విగ్రహాలుగా రూపొందించబడ్డాయి. దేవాలయంలోని సీలింగ్ అందమైన శిల్ప చెక్కడాలు ప్రదర్శిస్తుంది. దేవాలయ గోడల కింది భాగంలో అందమైన శివ, విష్ణు, దశావతారాలు, షణ్ముఖ, మాత కాళి, వివిధ రకాల జంతువులు ఉంటాయి. ఈ దేవాలయంలో కార్తీక శుక్ల పక్షంలో జరిగే విద్యాతీర్ధ రధోత్సవం ప్రసిద్ధి గాంచిన వేడుక.
Read Also..
Read Also..