మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో దీపానికి ఎంతో పవిత్రత వుంది. ప్రతి శుభకార్యాన్నీ దీపం వెలిగించిన తరువాతే ఆచరించడం మన సాంప్రదాయంగా భావిస్తాం. దీపం వెలిగించే ప్రక్రియలో ఎంతో అర్థం, పరమార్థం దాగిఉంది. అయితే వెలిగించిన దీపం పంచభూతాలకు ప్రతీక అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. దీపం తయారుచేయడానికి అవసరమైన మట్టిని భూమి నుంచి తీసుకుంటున్నాము, మట్టిని ప్రమిదగా తయారుచేసే క్రమంలో నీటిని ఉపయోగిస్తాము. కనుక ప్రమిదలో భూమి,నీరు రెండు వున్నాయి. ఇక దీపంలో నూనేను ద్రవం గా భావించి నీరుగా కూడా, భావించవచ్చు. ప్రమిదలో నూనె వేసి వత్తులు పెట్టి వెలిగించటానికి అగ్నిని వాడతాము అలాగే వెలిగిన ప్రమిద అగ్ని తత్త్వంగానూ, ప్రమిద వెలగడానికి కావలసిన ప్రణశక్తి గాలి లేక వాయువు నుంచిలభిస్తుంది. ఇక వెలుగుతున్న ప్రమిదలోని అగ్ని ఊర్ధ్వముఖంగా ఆకాశం వైపు చూస్తుంది. అంటే కాంతి ఆకాశంలోకి ప్రసరింపజేస్తున్నది. ఈ విధంగా వెలుగుతున్న ప్రమిద పవిత్రమైన దీపంగా పంచభూత తత్త్వానికి ప్రతీక కనుక, దీపాన్ని వెలిగించటం అంటే పంచభూత త్త్వాన్ని మనం గౌరవించటం అని వేద పండితులు తెలుపుతున్నారు.
Read Also..