149
ఆపిల్ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు. రోజూ కనీసం ఓ ఆపిల్ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్పినాయిడ్లు కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి. ఆపిల్ జ్యూస్‌కి ఆల్జీమర్స్ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.