సాధారణంగా అనేక మందులు, చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆముదాన్ని ఉపయోగిస్తారు. ఈ నూనె మలబద్ధకం చికిత్సలో సహాయపడే సహజ భేదిమందుగా పనిచేస్తుంది. అయితే ఇది మీ జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా గొప్పగా పనిచేస్తుంది.సహజ కండిషనింగ్ లక్షణాలతో నిండిన.. ఆముదం మీ తలకు తేమను అందిస్తుంది. ఇది మీ జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, ఫలితంగా మీ జుట్టును బలంగా, మృదువుగా మారుతుంది. అనేక ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలతో పుష్కలంగా నిండిన ఆముదం.. చర్మం పొడిబారడం, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్స గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దద్దుర్లు, దురద సమస్యలను కూడా నయం చేస్తుంది.
ఆముదం – ఆరోగ్య ప్రయోజనాలు
131
previous post