49
45 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా కాల్షియం లోపానికి గురవుతారు, ఎందుకంటే వారి పోస్ట్ మెనోపాజ్ కాలంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. మహిళల్లో కాల్షియం జీవక్రియలో – ఈస్ట్రోజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మెనోపాస్ స్థాయిలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ తగ్గుతుందో అపుడు కాల్షియం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతే కాదు కాల్షియం లోపం కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల…ఆస్టియో పోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా కాస్త రాపిడికి ఎముకలు పుటుక్కున విరిగే అవకాశం ఉంది.