95
ఇంక్ నట్, లేదా కరక్కాయ పేరు ఏదైనా సరే దగ్గు కి భేషుగ్గా పనిచేస్తుంది. కేవలం కాఫ్ రెమిడీ గా మాత్రమే కాదు మలబద్ధకం తగ్గిస్తుంది అలాగే డైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక దగ్గు జలుబు, గొంతు నొప్పి, కఫము విరుగుడు గా బాగా పనిచేస్తుంది. 1/4 Tea స్పూన్ కరక్కాయ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు సమస్య తీవ్రత బట్టి వాడుకోవచ్చు. కరక్కాయ నేరుగా చిన్న ముక్క ఒకటి నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా ఊరట లభిస్తుంది. దగ్గు జలుబు, గొంతు నొప్పి, మలబద్ధకం, జీర్ణశక్తి పెంచేందుకు ప్రతి రోజు తగు మోతాదులో కరక్కాయ తీసుకోవచ్చు.