కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది . కోకోవాలో ఉన్న ” పాలీఫినాల్స్ ” క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. వీటిల్ శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది. ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
Read Also..
Read Also..