117
ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తుంటాం.గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.గంజిని మనం పనికిరానిదని భావించి పారబోస్తుంటాం. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. అతిసారం, కడుపునొప్పి లాంటివాటితో ఇబ్బంది పడుతుంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే ఉపయోగం. ఇందులో క్యాలరీలు తక్కువ. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయే విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు.వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి తాగడంవల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు.