ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి, అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో ఒక యాలుక్కాయ, దంచిన మిరియాలు రెండు, సోంపు గింజలు అర టీ స్పూన్ వేసి 5 నుంచి 8 నిముషాల సమయం మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచి ఆ తర్వాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. నిమ్మరసం, తేనె కలిపి దీన్ని తీసుకోవడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నవారు దీన్ని తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టుకూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే – ఉల్లిపాయ టీ
92
previous post