96
తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినల్, విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణం గా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తం లో ‘లో డెన్సిటీ లైపోప్రోటీన్’ స్థాయిలను తగ్గిస్తుంది. తోటకూర యాంటీ -హైపర్ గ్లేసిమిక్ చర్యను ప్రదర్శిస్తాయి. తద్వారా టైప్-2 డయాబెటిస్ లో రక్తం లో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆకులలోని ప్రోటీన్ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం లో సహాయపడుతుంది. ఆకలి బాధలను తగ్గించి, అతిగా తినకుండా నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది.