విటమిన్ ఎ అధికంగా ఉండడం వలన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూర లో ఫైబర్, ఐరన్ అధికం అందుకే అందరికి మంచిదే కానీ స్త్రీలకు ప్రత్యేకంగా మంచిది. పాలకూర తీసుకోవడం వలన విటమిన్ డి ని వస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. బోలు ఎముకలల సమస్యను కూడా పరిష్కరిస్తుంది. పాలకూరను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అనీమియా సమస్యతో బాధ పడేవారు పాలకూరని తప్పక రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. రెగ్యులర్ గా కనీసం 4 వారాలు తీసుకొంటే హిమోగ్లోబిన్ అమాంతంగా పెరుగుతుంది. ఐరన్ తో పాటుగా సి విటమిన్ తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా శరీరానికి ఐరన్ బాగా పడుతుంది. పాలకూర వండేటప్పుడు అతిగా వేయించడం లేదా ఉడకబెట్టకూడదు. ఉడకబెట్టిన ఆకుకూరను చల్లనీటితో కడిగినందువలన కలర్ మారకుండా ఉంటుంది. ఆకుకూర కడిగి తర్వాత కట్ చేసుకోవాలి.
పాలకూర బహుప్రయోజనకారి
84
previous post