108
మెనోఫోబియా అంటే పీరియడ్ ఫోబియా. అమ్మాయిలలో, మహిళలలో నెలసరి పట్ల భయం, ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు. మెనో అంటే రుతుక్రమం, ఫోబియా అంటే భయం. దీనిలో పీరియడ్స్ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి, బాధ, ఆందోళన, ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి. మెనోఫోబియా కారణాలు ఒక్కో వ్యక్తికీ.. ఒక్కోలా ఉంటాయి. కొంతమంది మహిళలకు నొప్పితో కూడిన బాధాకరమైన పీరియడ్స్ ఉండొచ్చు. రుతుక్రమానికి సంబంధించిన సాంస్కృతిక నిషేధాలు ఉండొచ్చు. ఇవన్నీ కలిపి పీరియడ్స్ అంటే భయం, ఆందోళనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.ఇది కాకుండా, సామాజిక కళంకం, విద్య లేకపోవడం, రుతుస్రావం గురించి అపోహలు కూడా వీటికి కారణం కావచ్చు.