116
గత దశాబ్దంలో, వివిధ దేశాల నుండి అనేక అధ్యయనాలు రుతుక్రమంలో సగటు వయస్సును నవీకరించాయి. మొదటి సారిగా ఆడపిల్ల జీవితంలో వచ్చే పీరియడ్ నే మెనార్కి అంటారు. రాను రాను మొదటి ఋతుచక్రం వయసు తగ్గుతూ పోతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది బాలికలలో 10 మరియు 16 సంవత్సరాల మధ్య వయస్సులో మెనార్కి సంభవిస్తుంది. పోషకాహార లోపం, పేదరికం, సామజిక ఆర్ధిక స్థితి, కొంత మేరకు జన్యువులు, శారీరక దృఢత్వం మొదలైన అంశాలు మెనార్కి వయసును ప్రభావితం చేస్తాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో 1840లో 17 సంవత్సరాలకు నమోదై – నేడు 2000లో దాదాపు 12 సంవత్సరాలకు మెనార్కి యొక్క సగటు వయస్సు తగ్గిందని అనేక అధ్యయనాలు నివేదించాయి. నేడు 9 ఏళ్ల నుంచి 13 ఏళ్ళ మధ్య మెనార్కి మొదలు కావడం చూస్తున్నాం.