వేప ఆకు, వేపనూనె – దోమలను తరిమి కొట్టేందుకు నేచురల్ మస్కిటో రేపేలెంట్ గా పనిచేస్తాయి. కేవలం దోమల నుంచి మాత్రమే కాదు, క్రిమి కీటకాలనుంచి కూడా రక్షణ ఇస్తాయి. ఇంట్లో దోమల ఎక్కువగ ఉంటె వేప నూనె కొద్దిగా కొబ్బరి నూనె తో కలిపి చర్మం ఎక్స్పోస్ అయ్యే చోట ముఖ్యంగా కాళ్ళు చేతులకు రాసుకోవచ్చు. లేదంటే ఎండిన వేపాకులను కాల్చి ఆ పొగ ఇంట్లో అలాగే ఆరుబయట ఉంచితే కూడా దోమలు పోతాయి. అనేక రకాల ఇతర బ్యాక్టీరియల్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోగొట్టాలంటే నీటిలో వేపాకులను వేసి ఆ నీటితో స్నానం చేయవచ్చు. గజ్జి దురద తామర వంటి ఇన్ఫెక్షన్స్ కు వేప నీరు ఉపశమనం ఇస్తుంది. నోటి ద్వారా వేప రసం, వేపాకు చూర్ణం తీసుకొనే వారు తస్మాత్ జాగ్రత్త. అతిగా నోటి ద్వారా వేప తీసుకోవడం వలన కిడ్నీలు. లివర్ దెబ్బతినే అవకాశం ఉంది.
వేప నూనె – దోమల నివారణ
93
previous post