అయితే చాలా మంది వేడి నీటి స్నానం మంచిది కాదు. చన్నీటి స్నానమే మంచిదంటారు. కానీ, నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వేడి నీటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేస్తే. మంచి నిద్ర పడుతుంది. అలాగే మిగిలిన వాళ్లతో పోల్చితే. వేడి నీటి స్నానం చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, వేడి నీటి స్నానం గుండెకు సరైన రక్త ప్రసరణ అందించి.దాని పనితీరుని మెరుగు పరుస్తుందట. తద్వారా గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు. ఇక నేటి కాలంలో ఎక్కువ శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వేడి నీటితో స్నానంతో కూడా బరువును అదుపులోకి తీసుకురావచ్చు. అదెలా అంటే వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో వేడి పుట్టి అదనపు కేలరీలు కరుగుతాయి. అయితే వేడి నీటి స్నానం చేసినప్పుడు కూడా శరీరంలో వేడి పుట్టి. కేలరీలు కరిగి బరువు తగ్గేలా చేస్తుంది. అలాగే ప్రతి రోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తడి, తలనొప్పి పోయి మైండ్ ఫ్రెష్ అవుతుంది. వేడి నీటి స్నానం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజు మొత్తం పని చేసి అలసిపోయిన వారు వేడి నీటితో స్నానం చేస్తే. కండరాలు బాగా రిలాక్స్ అవ్వడంతో పాటు శరీరాన్ని మళ్లీ ఎనర్జీ మోడ్‌లోకి తీసుకువస్తుంది.
వేడి నీటితో స్నానం చేస్తున్నారా..!
79
previous post