ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతున్నారా..? ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న సందేహం. మరి మీకూ అలాంటి సందేహం ఉందా. అయితే ఇది చదవండి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రెజర్ కుక్కర్లో అన్నం ప్రయోజనకరమేనట. ప్రెజర్ తో ఉడకడంవల్ల అన్నం రుచిగా ఉంటుంది. కుక్కర్లో వండిన అన్నంలో పిండిపదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఊబకాయానికి ప్రధాన కారణం పిండిపదార్థమే. ఇదిలావుంటే ప్రెజర్ కుక్కర్లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ లాంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. కుక్కర్లో అన్నంతో ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు. ప్రెజర్ కుక్కర్లో వండిన అన్న సులువుగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి. ఎక్కువ ప్రెజర్ లో ఈ అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి. ఈ విధంగా ప్రెజర్ కుక్కర్లో వండే అన్నంలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాక వంట వేగంగా సిద్ధమవుతుంది. మంటపై ఎగిరినట్లుగా అన్నం ఎగరకపోవడంవల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.
Read Also..
Read Also..