శీతాకాలం వచ్చేసింది. రోజురోజుకు వేడి తగ్గుతోంది చలి పెరుగుతోంది. సూర్య రశ్మి కూడా సరిపోవడంలేదు చలి వణికిస్తోంది. అంతేకాదు చలికాలంలోనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాటినుంచి రక్షణ పొందేందుకు చాలామంది కాఫీ, టీలను తాగుతుంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. కషాయాన్ని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. అల్లం, మిరియాలు, దాల్చినచెక్క, పుదీనా ఆకులు, తులసి ఆకులు, బెల్లం, పసుపు వాడాలి. ముందుగా ఒక జార్ లో అల్లం ముక్కలు, మిరియాలు, వాము, దాల్చిన చెక్క, పూదీనా ఆకులు, కొద్దిగా నీరు పోసి మొత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో నీరు పోయాలి. తర్వాత గిన్నెను స్టవ్ మీద నీరు మరిగేవరకు ఉంచాలి. నీరు మరిగిన తర్వాత మరో రెండు నిముషాలపాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీటిలో బెల్లం, పసుపు కలపాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా తాగడం చాలా మంచిది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరైనా దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే ఈ కషాయాన్ని వాడటంవల్ల ఉదర సమస్యలు కూడా తొలిగిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!
74
previous post