చలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేస్తున్నారు. నువ్వులు శరీరానికి వేడితో పాటు అనేక విటమిన్లను అందిస్తాయి. నువ్వుల వినియోగం ఒక్కో మనిషికి ఒక్కోలా మారుతు ఉంటుంది. ఏదైనా ఎక్కువగా తీసుకోవడం హానికరమని, అలాగే నువ్వులను కూడా చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. నువ్వులను అనేక విధాలుగా తీసుకోవచ్చు. శరీరానికి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు B,E,కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి. శీతాకాలంలో వీటి అవసరం శరీరానికి చాలా ఉంటుంది. నువ్వుల్లో బెల్లం వేసి లడ్డూలను తయారు చేసి తినొచ్చు. స్వీట్స్ లో వేసి లడ్డూ తయారు చేస్తే మంచి రుచి వస్తుంది. నువ్వులు, బెల్లంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నువ్వులు తినేటప్పుడు సలాడ్లలో కూడా తీసుకుంటారు. నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో నమలొచ్చు. ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజూ ఒక టీస్పూన్ నువ్వులు తీసుకోవాలి. వీటిని డైట్లో చేర్చుకోవడంవల్ల గుండె సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు. పైల్స్, మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ఇవి మంచి ప్రభావం చూపుతాయి. నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. రక్తంలో షుగరును అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కీళ్లనొప్పులను తగ్గించడంతోపాటు థైరాయిడ్ ను నివారిస్తాయి. అంతేకాదు రక్తపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.
వ్యాధులను తగ్గించే దివ్య ఔషధం.. నువ్వులు
69
previous post