పచ్చని ప్రకృతిని చూస్తే ఎవరి మనసైనా ఆహ్లాదంతో నిండిపోతుంది. మొక్కలు, గడ్డి, చెట్ల మధ్య గడిపితే గుండె వేగం, ఒత్తిడి స్థాయిలు తగ్గుతున్నట్టు శాస్త్రీయంగా రుజువైంది కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు మరో కొత్త విషయం బయటపడింది. రోజూ పచ్చని వాతావరణంలో కొంత సమయం గడిపిన గర్భిణులు.. మరింత తెలివైన, ఆరోగ్యవంతులైన పిల్లలకు జన్మనిస్తున్నట్టు స్పెయిన్ పరిశోధకులు గుర్తించారు. వీరికి పుట్టే పిల్లల బరువు ఎక్కువగానే కాదు.. మెదడు పరిమాణమూ ఎక్కువగా ఉంటోందని కనుగొన్నారు. దీంతో వీరికి తెలివి తేటలూ అధికంగానే ఉంటాయి. వయసుకు మించిన బుద్ధికుశలత (ఐక్యూ) కూడా ఉంటోంది. ఇక తక్కువ బరువుతో పుట్టే వారితో పోలిస్తే ఎక్కువ బరువుతో పుట్టే వారికి పెద్దయ్యాక గుండెజబ్బు, అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత వచ్చే అవకాశం తక్కువ. నిజానికి గర్భిణులే కాదు.. ఎవరైనా రోజూ కాసేపు పచ్చని చెట్లు, మొక్కలు, పూల మధ్య విహరిస్తే శరీరానికి మరింత వ్యాయామం చేకూరుతుంది. భావోద్వేగాలు సైతం నియంత్రణలో ఉంటాయి. అందువల్ల వీలైనప్పుడల్లా ఆరుబయట, ప్రకృతి మధ్య గడపటానికి ప్రయత్నించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడు పార్కులకు వెళ్లటం.. ఆఫీసు సమావేశాలను ఎప్పుడూ గదుల్లోనే కాకుండా బయట లాన్లోనో పార్కుల్లోనో ఏర్పాటు చేసుకోవటం వంటివి చేయొచ్చని వివరిస్తున్నారు.
పచ్చని ప్రకృతి.. అమ్మకు తెలివైన బిడ్డలు..
149
previous post