ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న చోట ఆముదం నూనెతో మర్దన చేయాలి. ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట ప్లాస్టిక్ కవర్ తో కట్టాలి ఇలా ఒక గంట సేపు ఉంచాలి, ఆ తరువాత ఆ ప్రదేశంలో వేడినీటితో లేదా వేడి వస్తువుని పెట్టి కొద్దిసేపు మర్దన చేయాలి. సాధారణంగా నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు. అయితే నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని 2 స్పూన్స్ ఆముదం నూనె కలిపి మెత్తని వస్త్రాన్ని అందులో ముంచి పొట్ట మీద రాత్రి అంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన ఉదయం వరకు నులి పురుగులు చనిపోతాయి. ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుత ఔషదం అని చెప్పవచ్చు. ఆముదం నూనె ముఖానికి కూడా పెట్టవచ్చు, ఎండ వల్ల కమిలిపోయి నల్లగా అయిన చర్మం మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే ఆముదం నూనె పూతలాగా పూసి ఒక గంట తరువాత కడగాలి. ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
Read Also..
Read Also..