చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు అధిక వేడితో అలసిపోయినా మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా చెరకు రసం మీకు ఉపయోగపడుతుంది. కాలేయానికి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణకు చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. దాని ద్వారా వాటికి పురుగులు, దంతాలలో పుచ్చులు ఉండవు. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది. చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. అంతే కాకుండా చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేయడం సహా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
Read Also..
Read Also..