బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు , విటమిన్ ‘ సి ‘ దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను , ఎసిడిటీ కి చక్కని పరిష్కారము. దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూనరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్ ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలు గా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును. చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి , మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్ బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును. అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్తితులలఓ నాలుగు మీటల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింఝలంతేసి యుండును. గ్రామునకు 12 -15 తూగును. నీల వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును.
Read Also..
Read Also..