కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది. కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కువగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు. ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద. శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్మిటర్లను, డోపమైన్ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో వుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును. కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి. తేనె , పాలు , పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును.
Read Also..
Read Also..