తలనొప్పిగా ఉంది. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.
56
previous post
నవ దంపతులు ఆత్మహత్య..
next post