మారిన ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణమైంది. చిన్నగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీని వల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే గ్యాస్ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే స్పందిస్తే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.టేబుల్ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్ సమస్య నెమ్మదిస్తుంది.ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.
Read Also..
Read Also..