చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా 12 సంవత్సరాల వయసు నుంచే ఈ తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ఈ తెల్ల జుట్టు సమస్యకి కెమికల్స్ వాడి కూడా నల్లగా చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి లో లభించే కొన్ని ఔషధాలు వాడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అది ఎలాగో తెలుసుకోండి. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రకృతిలో లభించే బొప్పాయి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టుకి ఇది ఏ విధంగా పరిష్కారం చూపుతుంది అంటే ముందుగా మీరు చేయాల్సిన పని బొప్పాయి ఆకుల్ని తీసుకోండి, నాలుగు లవంగాలు మరియు ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ అదేవిధంగా బిర్యానీ ఆకులు మరియు హెన్న పౌడర్ ని తీసుకోవాలి. ముందుగా బొప్పాయి చెట్టు ఆకుల్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. దీనిని మిక్సీ జార్ లో వేసి ఒక అరకప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టే గుడ్డతో వడకట్టి కేవలం జ్యూస్ మాత్రమే తీసుకొని పిప్పిని పక్కన పడేయాలి. దీని తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు కాఫీ పౌడర్ వీటన్నిటిని తీసుకొని మరుగుతున్న గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి వీటిని వేసి మరిగించాలి. తగినంత హెన్నా పౌడర్‌ను గిన్నెలో వేయండి బొప్పాయి ఆకుల రసం, బిర్యానీ ఆకుల డికాషన్‌ను వేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 గంటల పాటు అలాగే ఉంచాలి. 5 గంటల తరువాత ఈ పేస్ట్‌ను మరోసారి గరిటతో మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరే వరకు ఉంచి తలస్నానం చేయండి. ఇలా నెలకు రెండు సార్లు చేయడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Read Also..
Read Also..