ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది. పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారుచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం, సాయంకాలం తాగితే పిత్తప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి, చూర్ణంగా దంచి, రెండు గ్రాముల మోతాదుగా, రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి. పల్లేరు మొక్కలు కాయలతో సహా తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మేక పాలకు కలిపి నానబెట్టి, మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి, దంచి గుడ్డలో వేసి పిండి, రసం తీయండి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో తాగండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే మగవాళ్లలో సంభోగ శక్తి పెరుగుతుంది. పల్లేరు కాయలు, అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ మోతాదుగా, రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ, పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి, దగ్గు, దౌర్బల్యం ఇలాంటి వ్యాధుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది.
పల్లేరు గృహ చికిత్సలు
234