షుగర్ ఉన్నవారు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్జూరంలో ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో పోషకాలు, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెలీనియం ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్రస్తుత జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. ఇది ఈ రోజుల్లో పిల్లల్లోనూ కనిపిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి. అదే విధంగా సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు త్వరగా దానిని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. స్వీట్స్ తినడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుందనే వాదన ఉంది. నిజానికి ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్నవారు తినొచ్చు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు. ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్ వారికి హెల్ప్ చేస్తుంది. దాదాపు 100 గ్రాముల ఖర్జూరంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. డేట్స్ తియ్యగా ఉన్నప్పటికీ, వాటిలో గ్లైసెమిక్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ సమస్యకి ఎలాంటి సమస్యని కలిగించదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే, రక్తంలో చక్కెరలో ఆకస్మిక స్పైక్స్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేరే స్వీట్స్‌తో పోలిస్తే డేట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Read Also..
Read Also..