చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. కేలరీలు 234, ప్రోటీన్ 4.7గ్రా, కొవ్వు 3.3 గ్రా, కార్బోహైడ్రేట్స్ 52 గ్రా, ఫైబర్ 11.3 గ్రా వీటితో పాటు విటమిన్ సి, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియంలు ఉన్నాయి. దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి. దానిమ్మ రసం తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి. దానిమ్మలో ఎల్లాజిటానిన్స్ అనే యాక్సిడెంట్స్ శరీరంలోని వాపుని తగ్గిస్తాయి. దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యని తగ్గిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్, కాల్షియం సాంద్రతని తగ్గిస్తుంది. దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దానిమ్మతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి. దానిమ్మ తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
దానిమ్మలో ఎన్నో అద్భుత గుణాలు
124
previous post