మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని రైల్వే గేట్ ను 6 నెలల క్రితం శాశ్వతంగా మూసి వేయడం జరిగింది.ఈ రైల్వే గెట్ ముసివేయడంతో పాత బస్టాండ్ సమీపంలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో గెట్ ఓపెన్ చేయాలనీ వ్యాపారులు షాపులు మూసివేసి దేవరకద్ర బంద్ చేశారు… ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఈ గెట్ క్లోజ్ చేయడంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, కనీసం తమ షాపుల కిరాయి కట్టుకోలేని దీనస్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్,సంత బజార్ లాంటి ప్రధానమైనవి అన్ని పాత బస్టాండ్ లోనే ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కల్గుతుందన్నారు.అధికారులకు, ప్రజాప్రతినిధులకు,రాజకీయ నాయకులకు ఎన్ని సార్లు చెప్పిన మా సమస్య ను పరిష్కరించడం లేదన్నారు. ఈ రైల్వే గేట్ క్లోజ్ చేయడం వల్ల మా వ్యాపారాలు నడవడం లేదు దీంతో తీవ్ర నష్టం ఏర్పడుతుంది.కావున వెంటనే రైల్వే గేట్ తెరవాలని,ఈ గేట్ తెరవడం సాధ్యం కాకపోతే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్యను పరిష్కరించకపోతే ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీస్తామన్నారు…
దేవరకద్రలో వ్యాపారస్తులకు తీవ్ర నష్టం
87
previous post