వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు. దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు నామినేషన్లు వేయనున్నారు. పరకాలలో నామినేషన్లు వేసేందుకు 100 గ్రీన్‌ఫీల్డ్ బాధిత రైతులు సన్నద్ధం అవుతున్నారు. 12 నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆసక్తి చూపుతున్నారు.
Warangal
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఉదంతంపై ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు.శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఈ నెల 13న బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శివరాం రాథోడ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతురాలి సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్ సందేశాలను గుర్తించారు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే శివరాం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.




Total views : 56808