తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో ఆకాష్ అంబానీ జియో స్పేస్ ఫైబర్‌పై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ జియో స్పేస్ ఫైబర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. జియోతో టెలికం రంగంలో అద్భుతాన్ని సృష్టించిన రియలన్స్ ఇప్పుడు జియో స్పేస్ ఫైబర్ పేరుతో మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ విషయమై జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ. ‘జియో స్పేస్ ఫైబర్‌తో దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుంది. గిగాబిట్ యాక్సెస్‌తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో భాగమవుతారు. దేశంలోని చాలా మంది తొలిసారి ఇంటర్నెట్ సేవలను పొందనున్నారు’ అని చెప్పుకొచ్చారు. దీనికోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో పనిచేస్తుంది.
Read also..