గత రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తల వల్ల గ్రామంలో భార్య పావనిను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రితం శ్రీ సిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పని చేస్తున్న కాటయ్యకు అదే కంపెనీలో పనిచేస్తున్న పావని పరిచయం అవ్వడంతో ప్రేమించి పెద్దలను ఎదిరించి సూళ్లూరుపేటలోని చంగాలమ్మ గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. కాటయ్య మందు తాగడం మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసై పెళ్లి అయిన తరువాత పరిశ్రమకు పోకుండా పని నిలిచిపోయి భార్యను కూడా ఉద్యోగానికి పోకుండా ఆపేశాడు. కాటయ్య తన వ్యసనాల కోసం అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అతని అలవాట్లకి ఇంటి ఖర్చులకు డబ్బులు సరిపోక అతని భార్యని కొట్టి వాళ్ళు పుట్టింటి నుండి డబ్బులు తీసుకొని రమ్మని వేధించేవాడని ఈ చిత్రహింసలు భరించలేక తన గోడును తల్లిదండ్రులకు చెప్పుకొని అప్పుడప్పుడు అక్కడ నుండి డబ్బులు తీసుకువచ్చి జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భార్యపై భర్తకు అనుమానం పెరగడంతో తీవ్రంగా మానసికంగా హింసించేవాడని గత నాలుగు నెలల క్రితం తనకు డబ్బు చాలా అత్యవసరమని మీ తల్లి తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొని రమ్మని ఒత్తిడి చేయడంతో పావని ససేమిరా అనడంతో తీవ్రంగా తలకు గాయపరిచి వేధించిన విషయం పావని తల్లిదండ్రులకు తెలిసి వారు తమ ఇంటికి తీసుకుని వెళ్లి చికిత్స చేసి అల్లుడు కాటయ్య ను పిలిచి పదివేల రూపాయలు ఇచ్చి తమ కూతురిని వేధించవద్దని చెప్పి పంపించారు. విపరీతంగా అనుమానం పెరగడంతో రెండు రోజుల క్రితం సూళ్లూరుపేట నుంచి తెచ్చుకున్న కత్తితో పావని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. హత్య చేసిన తరువాత హత్యకు వాడిన రెండు కత్తులు పక్కనే ఉన్న చెరువులో పడవేసి సూళ్లూరుపేట కు పారిపోయాడని అతన్ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Read Also..