ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొంతుతూ మృతి చెందిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.లాలాపేటలోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఆదే ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ అనే -వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తాజాగా దిలీప్ కు ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటూ బాలకృష్ణ అడిగాడు, మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగివ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో దిలీప్ తన సోదరుడు సాయికుమార్ తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టారు. అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో కొట్టి, ఒంటిపై పెట్రోల్ పోశారు. నిప్పంటించే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకొని దేహశుద్ది చేసి పంపించారు. అనంతరం, కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుమారుడు ఫణీంద్ర తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నాడు. వెంటనే కొపంతో కర్ర పట్టుకొని ఫణీంద్ర, అతని బంధువైన రాకేష్ యాదవ్ కలిసి దిలీప్ ఇంటికి ఆవేశంగా పరుగులు తీశారు. మార్గం మధ్యలో దిలీప్, సాయికుమార్‌లను చూసిన వెంటనే ఫణీంద్ర, రాకేష్ వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఫణీంద్ర తన చేతిలో ఉన్న కర్రతో దిలీప్ తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో రక్తశ్రావమై అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దిలీప్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర, రాకేష్ యాదవ్ పై హత్య కేసు నమోదు చేశారు. అదే విధంగా బాలకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన సాయికుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Crime
కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని తిమ్మాపూర్ మండలం(Timmapur Mandal) వచ్చునుర్ లో ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మరణించారు. లోయర్ మానేరు గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో చిన్న కొడుకు జయ చైతన్య రెడ్డి(Jaya Chaitanya Reddy) నీటిలో మునిగిపోతుండగా లింగారెడ్డి(Lingareddy) కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ప్రవాహంలో వీరిద్దరూ మునిగిపోయారు. అయితే వీరిద్దరిని కాపాడేందుకు పెద్దకొడుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయమై ప్రమాదం నుండి బయట పడిన జయకౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం..!
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని…
- నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్(Police Station) పరిధి రోడ్ నెంబర్ 10 లో బెంజ్ కారు(Benz car) బీభత్సం.. కరెంట్ ట్రాన్స్ఫారం పైకి దూసుకెళ్లిన కారు. భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి. కారుకి వెనుక ముందు నంబర్ ప్లేట్ తొలగింపు. కార్ నడుపుతున్న వ్యక్తి జూబ్లీహిల్స్ లో ఓ బడా బాబుకారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు గుర్తింపు. కార్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఏమి కాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా..
- అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
- హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
- తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్ మెషీన్లతోపాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నెల్లూరు జిల్లా(Nellore district), జాతీయ రహదారి(National Highway) కావలి గౌరవరం టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఒకరి పరిస్థితి విషమం ఉంది. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇది చదవండి: వెనిగండ్ల రాము.. నామినేషన్ దాఖలు..
క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అంధిస్తున్నారు. చెన్నై నుండి లక్నో కి ఏసీ లతో వెళ్తున్న కంటైనర్ లారీ.. చెన్నై నుండి ఏలూరుకు వెళుతున్న స్విఫ్ట్ కారు అతివేగంగా ఢీకొట్టంది. లారీ కింద ఇరుక్కున్న కారు ను క్రైమ్ సహాయంతో పోలీసులు బయటకు లాగారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్న డీఎస్పీ వెంకటరమణ(DSP Venkataramana) కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
- ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉప్పల్, Uppal Chain Snatching
ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ లోని గోకులేనగర్ లో ఇంటి ముందు వాకిలి ఊడ్చుతున్న యాదమ్మ(62) అనే వృద్ధురాలు మెడలో నుండి నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తుతున్న దొంగని వెంటాడి పట్టుకున్న స్థానికులు. దొంగని పట్టుకున్న స్థానికులు, ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
చిత్తూరు జిల్లా, పుత్తూరు | Huge Liquor Dump
పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్. సుమారు 250 కేసుల మధ్యంను ఒక ప్రైవేటు కళాశాలలో డంప్ చేసిన వైసీపీ నాయకులు. ఈ రోజు నగరిలో రోజా నామినేషన్ ఉండడంతో రాత్రి ఒంటిగంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పట్టుబడిన పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు. కేసు లేకుండా చేసేందుకు పోలీసుల పై రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్న మంత్రి రోజా. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు. ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
- నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్…
జనగామ జిల్లాలో దారుణం | Janagama Murder
మనవడి చేతిలో నానమ్మ మృతి చెందిన ఘటన జాఫర్ ఘడ్(Jafargarh) మండలం ఉప్పుగల్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మామిడ్ల ఎల్లమ్మ 65 అనే వృద్ధురాలు కొడుకు సమ్మయ్య ఇంట్లో నివాసం ఉంటోంది. గత కొద్దిరోజుల క్రితం కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు ఈ క్రమంలో కోడలు రజిత మనవడితో కలిసి ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అత్తా కోడలు తరచూ గొడవ పడుతుండడంతో వృద్ధురాలి వల్లే తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నెపంతో కొడుకు సమ్మయ్య కుమారుడు మైనర్ బాలుడు ఎల్లమ్మ నిద్రిస్తున్న క్రమంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లమ్మ మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోగా పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మార్చరికి తరలించారు. దీంతో ఎల్లమ్మ హత్య ఉదాంతం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
- నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నానమ్మ ని కడతేర్చిన మైనర్ మనవడు
నాగర్‌కర్నూలు జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్(TSSP Constable) బాలేశ్వర్ హైదరాబాద్(Hyderabad)లో ఆత్మహత్య చేసుకున్నాడు. 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ 10వ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఓల్డ్ సిటీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్‌ఖానా పోలీసు పికెట్ వద్ద ఈ తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రౌండ్లు ఫైర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు గన్ మిస్‌ఫైర్ అయిందా? లేదంటే ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: హుజూరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
తెలంగాణ(Telangana)లో తొలిసారి ఓ ఏనుగు(Elephant) బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు మరొకరిని బలితీసుకుంది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో ఏరుతున్న అల్లూరి శంకర్ ను తొండంతో కొట్టి చంపిన ఏనుగు 24 గంటలు కూడా గడవకముందే పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు కారు పోచయ్యను తొక్కి చంపేసింది.
ఇది చదవండి: నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ పర్యటన
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్న ఆయనపై దాడి చేసిన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును బంధించేందుకు మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. అలాగే, ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శివారు ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
హన్మకొండ జిల్లా(Hanamkonda district)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒక వ్యక్తి చనిపోయాడు. హాసన్ పర్తి మండల శివారులోని అనంతసాగర్ వద్ద కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళుతున్న డిగ్రీ విద్యార్థి యాద రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి కౌశిక్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఇద్దరు ఓ వివాహ బారాత్ లో పాల్గొని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: తెలంగాణలో భానుడి భగభగలు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి