అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. పలువురు పోలీసు అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సీపీ సన్మానించారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవం
54
previous post