86
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష చేసి అనంతరం జలాశయాన్ని సందర్శించనుంది. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలాఉండగా..కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం పొంచిలేదని సాగునీటి రంగ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ ఇంజినీరింగ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన వారంతా నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు.