మెంతి ఆకులు గుండె జబ్బులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం లో సహాయపడుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్‌లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి. ఈ ఆకులు తినడం ద్వారా శరీరం లో వేడి చేసి.. కొవ్వును కరిగిస్తాయి. వీటిలోని ఫైబర్.. మెటబాలిజంను పెంచి.. బరువు తగ్గేలా చేస్తుంది.బయటి ఆహారం ఎక్కువగా తినేవారికి అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లోనే వారానికి రెండుసార్లు మెంతి కూర చేసుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నగా ఉండే ఈ ఆకులు చేసే ప్రయోజనం పెద్దదే. .. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడపునొప్పి, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి. మెంతి ఆకులను నేరుగా పప్పు లేదా వివిధ రకాల కూరగాయలతో కలిపి వండుకోవచ్చు.
Read Also..
Read Also..