తెలంగాణలో దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్ స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు సీబీఎస్, దిల్‌షుక్‌నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్‌ల నుంచి కూడా ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. దసరా సందర్భంగా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
దసరా పండుగ సందర్భంగా కాసుల వర్షం
67
previous post