చాలామంది రాత్రివేళ నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక చక్కని విధానాన్ని అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి టెన్షన్ ను వదిలేసి ఐదునిమిషాల్లో నిద్రపోయే ఆ విధానం ఏంటి?మరి ఆ ట్రిక్ ఏమిటి అంటే. నిద్రపోవడానికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ముందు మీ శరీరాన్ని కామ్ డౌన్ చేసి, శరీరానికి విశ్రాంతినివ్వాలి. మనసులో నుండి ఆలోచనలను తీసివెయ్యాలి. ఆ తర్వాత నిదానంగా కళ్ళు మూసుకుని శరీరంలోని అన్ని భాగాలను రిలాక్స్ చేయాలి. నుదుటి కండరాలను రిలాక్స్ చేయాలి. ఆ తర్వాత శ్వాస మీద దృష్టి పెట్టి భుజాలను కూడా రిలాక్సింగ్ మోడ్ లో ఉంచి ఉచ్వాస నిశ్వాసలపై దృష్టి పెట్టాలి. లోతుగా శ్వాస తీసుకుంటూ, మళ్లీ శ్వాస వదులుతూ శ్రద్ధ మొత్తం బ్రీతింగ్ పైనే పెట్టాలి. అప్పుడు కచ్చితంగా ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు.
Read Also..
Read Also..