అమ్మవారి ఆరాధన విశిష్ఠతను తెల్సుకోవాలంటే ముందు అమ్మను అనుగ్రహించమని వేడుకోవాలి. మహాశక్తిని మనః పూర్వకంగా ప్రతి క్షణం ధ్యానించాలి. శక్తికి సంబంధించిన మంత్ర, తంత్ర విధానం గురువుద్వారా పొందాలి. అమ్మవారి కోరిక మేరకుపరమేశ్వరుడు శ్రీ తంత్రమును శ్రీవిద్యగా అనుగ్రహించాడు అని పండితుల తెలియచేస్తుంటారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు త్రిపుర సుందరి అమ్మవారిని ఉపాసించి కొన్నివేల శ్లోకాలతో దత్త సంహితను రచించారని అంటారు పండితులు . లలిత సహస్ర నామ భాష్యం మనకు భాస్కరాచార్యుల వారు అందించారు. ఆయన రచనలు మూడిటిని శ్రీ విద్య ప్రస్థానత్రయం గా పేర్కొంటాము. జగద్గురువులు, వ్యాసులవారి ఆర్యాద్విశతి, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి మొదలగు అమ్మవారి స్తోత్రాలను మనకు అందించారు. నేడు ఆ స్తోత్రాలతోనే మనం శ్రీచక్రాన్ని పూజించి అమ్మవారి అనుగ్రహాని పొందగలుగుతున్నాం. అరవిందుల వారు, శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు దశ మహా విద్యలు గురించి వివరించారు. కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, ధూమవతి, భగళ, మాతంగి, మరియు కమలాత్మిక. ఈ పేర్లతో అమ్మవారిని దశమహావిద్యలలో మనం ఆరాధిస్తాం .అమ్మ కొలువుదీరిన ప్రదేశాలు ఎన్నెన్నో ప్రసిద్ద క్షేత్రాలుగా పేరుగాంచాయి. మహిమలను చూపాయి.హిమాలయాలలో
ఉమాదేవి, కశ్మీర్లో అంబ సరస్వతి గానూ, వారణాసిలో విశాలాక్షి, కన్యా కుబ్జంలో గౌరీ, మహారాష్ట్రలో భవాని, కలకత్తా కాళీ దేవి, కన్యాకుమారి బాల, మధుర లో మీనాక్షి, శ్యామల, మంత్రిణి గానూ, జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి దేవి లేదా దండిణి , కాంచీపురం లో కామాక్షి లేదా మహా త్రిపుర సుందరి, శృంగేరిలో శారదా దేవి, మైసూరులో చాముండేశ్వరి, భగవతి గా కేరళ లోనూ, శివ శక్తి స్వరూపంగా అమ్మవారు పూజలందుకుంటోంది. నవరాత్రులలో ప్రతి గృహంలోనూ దుర్గా లక్ష్మి సరస్వతి గా, ముగ్గురమ్మల మూలపుటమ్మ గానూ పూజింపబడుతుంది శ్రీలలితా పరాభట్టారిక. ఏ రూపంలో అమ్మ పూజలు అందుకున్నప్పటికీ శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పినట్లుగా పరబ్రహ్మ స్వరూపంగా జగత్ ప్రసిద్ది పొందింది. నిజమైన సౌందర్యాన్ని చూడాలి అంటే అమ్మనే చూడాలి. భక్తి భావంతో చూడాలి. అత్యంత ప్రశాంతమైన అద్భుతమైన రూపం అమ్మది. ఆ అమ్మ శక్తి స్వరూపం. వేదాలలో ఆమెను శ్రీ సూక్తం ,దుర్గా సూక్తం, భూ సూక్తం త్రిపుర, భవానోపనిషధ్ లు,ఇతర దేవీ ఉపనిషద్ లలో శివశక్తి రూపిణీ గా అభివర్ణించారు. నిత్యం చేసే సంధ్యా ఉపాసనలో గాయత్రీ దేవిగా కరుణిస్తుంది. మార్గ దర్శనం చేస్తుంది అన్ని పురాణ కథలు లో కార్య సాధన కోసం ఆమెని ప్రార్థించారు. కళ్యాణం కోరిన వరునితో జరగడానికి సాక్షాత్ రుక్మణీదేవి కూడా ” హరిన్ పతి సేయుమమ్మా.”అంటూ వేడుకోవడం పోతన గారు అందంగా మనకు భాగవత కథలోఅందించారు. బ్రహ్మ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రము మరియు త్రిశతి అమ్మను ఏ విధంగా కొలవాలి. అని మార్గం చూపుతాయి. మార్కండేయ పురాణం కూడా శక్తి స్వరూపంగా లలితా దేవిని చండీ రూపంలో ఆరాధన మంచిదని అని చెప్తుంది. ఆగామ,రహస్య, సంహిత,యమల, అర్ణవ,తంత్ర…ఇలా పరి పరి విధాల అమ్మను కొలవడం తెలిసిందే. ఇలా శ్రీలలితా పరాభట్టారిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్పిస్తుంది.
శివ శక్తి స్వరూపమే … శ్రీలలితా దేవి
105
previous post