పెద్దలు చెప్పిన ఈ సూక్తికి నూటికి నూరుశాతం సరిపోయో కధ.. మనందరికీ వర్తించేది విశ్వామిత్రుని కోపం…కధ. పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా కలిసింది ఆపై మాటలుపెరిగాయి. తర్వాత అంతులేని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. ఇంద్ర స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు… అదే త్రిశంఖు స్వర్గం! అయితే పుణ్యాత్ములంతా దేవేంద్రుడి స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు. కొన్నాళ్ళకి దేవేంద్రుడి పై వున్న ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో తపశ్శక్తిని అంతా దేవేంద్రుడి పై కోపం, ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే!’ అని మళ్ళి తపస్సు ప్రారంభించాడు. మళ్ళి 1000 సం.లు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే వ్యవహారం విజయవంతం కాదని విశ్వామిత్రుడు… , పెద్దగా స్పందించడని గ్రహించి తెలివిగా ఊర్వశిని పంపాడు. విశ్వామిత్రుడు తప్పస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు వొలికిస్తూ నిలబడి ఉంది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడయ్యాడు. అంతలోనే సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు తన తపోశక్తిచే శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి, బ్రాహ్మణోత్తముడు నిన్ను ఉద్ధరించగలడు అని రంభకి శాపవిమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు. అనంతరం విశ్వామిత్రుడు తన తపోశక్తి వృథా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళి తపస్సు చేశాడు. ఈసారి పరమశివుడిని మెప్పించటానికి వేయి సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహంతో వివిధ అస్త్రాలను వాటి ప్రయోగ రహస్యాలను పొంది సంతోషించే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. తను వెళ్ళినా, ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదని ఈ సారి ఇంకొంచేం జాగ్రత్తగా పధకం వేసి విశ్వామిత్రుడుకి వశిష్టుడిని ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని చూసేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు… తను మహాదేవుడి నుండి పొందిన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు.. అవి అన్నీ వశిష్ఠమహర్షి బ్రహ్మదండంలో కలిసిపోతాయి.అంతే వెయ్యేళ్ళ తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది. తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో ఎంత పొరబాటు చేశాను. తపశ్శక్తిని క్షణకాలంలో వృథా చేసేశాను,’ అని బాధపడ్డాడు. ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశాపడినా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. కాని కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకు పోయింది. కోపం అంత బలమైనది. ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలామంది. కాని అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది. వేయి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు, యే సాధనలు లేని మామూలు జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహాపెద్ద శత్రువు. మన కోపంతో మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలితే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం పేదరికం! మీరు ఎందులో బలంగా ఉంటే దాన్నే దెబ్బతీస్తుంది మీ కోపం. మీ కోపమే మీ శత్రువు. ఈ కధని దృష్టిలో పెట్టుకొని మీ కోపం తగ్గించుకోండి! అందున మంచి స్థితి, హోదా, పదవిలో వున్న వారు మరింత జాగ్రత్తగా వుండాలి అనేది ఈ కధ సారాంశం.
Read Also..