దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను బయబ్రాతులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫైర్ నిబంధనలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. అయితే దీని మీద రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ బంకు దగ్గర అమ్మకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని దానికి తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకుంటామని రాబోయే రోజులు అక్కడ అనుమతులు ఇవ్వకుండా చర్యలు చేపడతామని సివిఆర్ న్యూస్ కు వివరించారు పర్మినెంట్ గా ఉన్నటువంటి క్రాకర్స్ అనుమతులకు సంబంధించిన షాపులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరలో వేరోక ప్లేస్ కి మారుస్తామనీ అంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి.
Read Also..