దీపావళి నాడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే ఉల్లాసంగా… ఆనందంగా… ఆద్యాత్మిక వైభవంతో ఈ పండుగను జరుపుకొవచ్చు. దీపావళిరోజు కొత్తబట్టలతో.. పిండివంటలతో… స్నేహితులతో సంబరాలు జరుపుకొనే వారు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది.. మీ ఇంట్లోని వారు ఆందోళన పడకుండా వుంటారు. దీపావళి చిన్నారులకు అత్యంత ఇష్టమైన పండుగ… వారికి నచ్చిన పిండివంటలు బాణాసంచా ఈ పండుగ ప్రత్యేకం.. అందుకే బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం. అలాగే చిన్నారులు, మహిళలు.. వృద్దాప్యంలో వున్నవారు మతాబులు.. చిచ్చుబుడ్లు.. కాకర పువ్వవత్తులు, అగ్గపెట్టేలు కాల్చేటపపుడు జాగ్రత్తలు అవసరం లక్ష్మీబాంబులు, ఔట్లు, సీమటపాకాయలు, రకరకాల బాణసంచా కాల్చేవారు యువకులు చాలా అప్రమత్తంగా వుండాలి. పేలని వాటికోసం మళ్లీ వెలిగించాలని ప్రయత్నించవద్దు. మీరు కాల్చే బాణసంచా మరీ విపరీతమైన శబ్దాలు చేస్తే మీ చుట్టుప్రక్కల చిన్నపిల్లలు జడుసుకోవచ్చు. అలాగే అనారోగ్యంతో ఇబ్బందిపడేవారు ఆశబ్దాలుకు భయపడటంచేత వారికి అసాధారణ వత్తిడి కలిగే పరిస్థితులు సంభవించవచ్చు. యువకులు రాకేట్లు, స్కైప్లయర్స్ , దీపావళి షట్స్ లాంటివి కాల్చేటప్పుడు ఎదురుగా వున్న ఇళ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిప్పు రవ్వలు ఒంటిపైన, దుస్తులపైన పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే ధరించడం మంచిది
టపాసులు కాల్చేటప్పుడు మంటలు రేగితే అదుపు చేసేందుకు బకెట్‌లో నిండుగా నీళ్ళు పెట్టుకోండి ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్ స ర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబరు గుర్తుపెట్టుకోండి. పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది… బాంబులను ఎవరు కాల్చినా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో నేలపై పాకే పసికందులను కిదకు దించవద్దు. విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి. అత్యంత ముఖ్యంగా థౌజండ్ వాలా, 10 థౌజండ్ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకొని, పక్కవారికి చెప్పి కాల్చండి. అలాగే వీటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా అత్యధిక శబ్ద కాలుష్యం వేలుబతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయవద్దు వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి. పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని గుడిసెలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి.
గొప్పలు కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి చేరువ కావద్దు. భారీ శబ్దాలను, విస్పోటనాలను కలిగించే టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా.. సరదాగా మీ బాణసంచా కాల్చండి. ఈ దీపావళిని సంబరాలతో జరుపుకోండి. రాత్రికి త్వరగా బాణసంచా కాల్చి కాళ్లు,చేతులు శుభ్రపర్చుకుని లక్ష్మీదేవిని పూజించండి హాయిగా విందు ఆరగించండి.. ఆరోగ్యంగా వుండండి.
దీపావళి పండుగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
45
previous post