జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గడియార స్తంభం సెంటర్ లో 100 అడుగుల జాతీయ జెండాతో విధ్యారిని, విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డీ, మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, టీచర్లు పాల్గొన్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ లో జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తూ జాతీయ గీతాన్ని ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు, విధ్యారిని, విద్యార్థులు ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించిన మహనీయుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. ఆయనకు పిల్లలంటే అమితమైన ప్రేమ అన్నారు. అంతేగాకుండా దేశానికి దిశ, దశ నిర్ధేశించేది బాలలే అన్నారు. ధనిక, పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని నెహ్రూ ఆకాంక్షించారన్నారు. అందుకోసమే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వివరించారు.
Read Also..