చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది. తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో కూడా అడుగు పెట్టింది. ఈ కంపెనీ తాజాగా ‘Xiaomi SU7’ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఈ కంపెనీ తాజాగా ‘షియోమీ SU7’ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లతో పాపులర్ అయిన షియోమీకి ఇది ఒక పెద్ద అడుగు. SU7 ఒక ఎలక్ట్రిక్ సెడాన్, ఇది షియోమీ టెక్నాలజీతో వస్తుంది. ఈ కారు డిజైన్‌ను చైనీస్ ఆటోమేకర్ BAIC కార్ మేకింగ్ స్కిల్స్ నుంచి తీసుకోనుంది. చైనాలోని మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MIIT) ఫైలింగ్స్‌లో ఈ మొదటి కారు కనిపించింది. బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కో. లిమిటెడ్ (BAIC) దీనిని తయారు చేస్తుంది. కానీ షియోమీ ‘Mi’ బ్రాండింగ్‌తో వస్తుంది. SU7 ఎలక్ట్రిక్ కారు, SU7 ప్రో, SU7 మ్యాక్స్ వంటి మూడు వేరియంట్లలో వస్తుంది. ప్రతి వేరియంట్ వేర్వేరు కస్టమర్లు మెచ్చే విభిన్న ఫీచర్లు, ధరలతో లాంచ్ కానుంది. SU7 కారు విడుదలయ్యాక చైనీస్ మార్కెట్లో టెస్లా మోడల్ 3, BYD సీల్, BMW i4 వంటి ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది. SU7 రియర్-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ వంటి రెండు పవర్‌ట్రెయిన్ రెండు ఆప్షన్స్‌తో వస్తుంది. రియర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లో 295 bhp మోటార్ ఉంటుంది. ఇది 210 kmph టాప్ స్పీడ్అం దుకోగలదు. ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లో 664 bhp మోటార్ ఉంటుంది, ఇది 265 kmph టాప్ స్పీడ్ అందుకోగలదు. SU7 ఎలక్ట్రిక్ కారు షియోమీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ఓఎస్ వంటి అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తుంది. హైపర్ఓఎస్ కారు, స్మార్ట్‌ఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది. SU7 వేరియంట్‌ను బట్టి వివిధ రకాల బ్యాటరీలతో లాంచ్ అయ్యింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్లో చైనీస్ కంపెనీ బిల్డింగ్ యువర్ డ్రీమ్స్ తయారుచేసిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఆఫర్ చేశారు, అయితే అధిక వేరియంట్లలో పెద్ద CATL బ్యాటరీలను అందించారు. బ్యాటరీల కచ్చితమైన సైజు, రేంజ్ ఇంకా వెల్లడించలేదు. SU7 ఇన్నోవేటివ్ టెక్నాలజీ, డిజైన్, పర్ఫామెన్స్తో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌ను మార్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కారును కోరుకునే యూజర్ల కోసం ఇది కొత్త, ఆకర్షణీయమైన ఆప్షన్‌ను అందిస్తుంది.
మార్కెట్లోకి షియోమీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు..
166
previous post