పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గం లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు సమీపంలో గల శైవ క్షేతాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే స్వామి దర్శనం కొరకు శివాలయం నందు బారులు తీరారు.అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు.కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది.స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 20 రూపాయలు ప్రత్యేక దర్శనం తో పాటు ఉచిత దర్శనం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భమిడిపాటి దుర్గా లక్ష్మినారాయణ, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు..
71
previous post