రహదారి భద్రతను ప్రోత్సహించడానికి, వేగ పరిమితులను పాటించడంలో డ్రైవర్‌లకు సహాయం చేయడానికి గూగుల్ మ్యాప్స్ ఓ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వీధుల కోసం నిజ-సమయ వేగ పరిమితి సమాచారాన్ని ప్రదర్శించే కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ఈ ఫీచర్ ను డ్రైవర్‌లకు వేగం, ఇతర సంబంధిత సమాచారాన్ని అందించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. ప్రత్యేకించి వాతావరణం లేదా వివిధ ప్రాంతాలలో తెలియని ట్రాఫిక్ చట్టాల కారణంగా తక్కువ దృశ్యమానత వంటి పరిస్థితులలో ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు కొత్త ఫీచర్‌ని ఇలా ఉపయోగించుకోవాలి. మీ మొబైల్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. పైన కుడివైపున ప్రొఫైల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి సెట్టింగ్ పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌ని కిందకు స్క్రోల్ చేసి నేవిగేషన్ సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో డ్రైవింగ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో డ్రైవింగ్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు ఉంటాయి. వాటిలో speedometer ఆప్షన్‌ను ఎనేబల్ చేసుకుంటే మీరెంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలానే పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడుపుతుంటే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఉదాహరణకు డ్రైవర్లు హైవే నుంచి స్థానిక రహదారికి మారడం వంటి పరిస్థితులలో వారు వేగ పరిమితిలో మార్పును వెంటనే గుర్తించలేరు. ఇది అనుకోకుండా అతివేగానికి దారి తీస్తుంది. అందుకే ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు. డ్రైవర్‌లకు సహాయం చేయడానికి, డ్రైవర్‌లకు మెరుగైన భద్రత, నావిగేషన్ సహాయం అందించడానికి Google Maps ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్‌ల కోసం నిజ-సమయ వేగ పరిమితి సమాచారాన్ని ప్రదర్శించే స్పీడోమీటర్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్..!
86
previous post