కొబ్బరి నూనె హానికరమైన సూక్ష్మజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. మొటిమలు, ఫోలిక్యులిటిస్, సెల్యులైటిస్ వంటి చర్మ వ్యాధులు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. చర్మం కోసం కొబ్బరి నూనె పొడి, పగిలిన చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. తేమను బాగా నిలుపుకోవడంలో ఉపయోగపడుతుంది. పొడి చర్మానికి కొబ్బరినూనె మంచి మందు. కొబ్బరి నూనె మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఈ నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను నివారిస్తాయి. ఇందులోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయగలవు. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనెకు ఉంది. కొబ్బరి నూనె చర్మం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కొబ్బరి నూనె సహాయపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. చలికాలంలో దీన్ని లిప్ బామ్‌గా కూడా ఉపయోగించవచ్చు.
చలికాలంలో కొబ్బరినూనె.. చర్మానికి దివ్యౌషధం..!
100
previous post